30-07-2025 06:49:15 PM
హనుమకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University)లో ఎన్సీసీ పదవ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ ఆధ్వర్యంలో పది రోజుల కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-6 వాయు సేన ఇంటర్ గ్రూప్ క్యాంప్ కల్నల్ ఎస్ ఎస్ రామదురై క్యాంప్ కమాండెడ్ ఆధ్వర్యంలో 758 మంది క్యాడేట్స్ శిక్షణ పొందుతున్నట్లు కమాండెంట్ తెలిపారు. 10 రోజుల క్యాంపులో 7వ రోజు వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ అన్నారావ్ నెంబర్కర్ వీర్ చక్ర శిక్షణ పద్ధతులు, ఇంటర్ గ్రూప్ వాయిస్ సేన క్యాంప్ శిక్షణ, ఫైరింగ్, డ్రిల్లు కల్చరల్, బెస్ట్ క్యాడెట్, ఫ్లాగ్ ఏరియా, క్యాంప్ లొకేషన్ ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు.
ఆర్డిసి, వాయిసేన ఇంటర్ గ్రూప్ శిక్షణ పొందుతున్న క్యాండిడేట్స్ కు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు గ్రూప్ గ్రూప్ కమాండర్ సచిన్ అన్నారావు నేమ్ బాల్కర్ క్యాంప్ కమాండెంట్ను కల్నల్ ఎస్ఎస్ రామదురైని శిక్షణ పద్ధతులపై తనకి అనంతరం అభినందించారు. ఎన్సీసీ కేడెట్స్ నైపుణ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు అభినందించారు. మరో శిక్షణలో భాగంగా సెక్షన్ డ్రిల్ డెమో కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమానికి యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్ మల్లారెడ్డి, కేయూ, హాస్టల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్ కుమార్, బి. రమా, బి. మంజుల, సలోని హాజరు కావడం జరిగింది.ప్రొఫెసర్ మల్లారెడ్డి ప్రత్యేక క్రమశిక్షణతో విన్యాసాలను దేశాన్ని ఎలా రక్షించాలని అటువంటిది ఒక అద్భుత ప్రతిభతో ప్రదర్శన ఉందని అభినందించారు.
ప్రత్యేక క్యాంపస్ మరియు సెక్షన్ ఫార్మేషన్ ఆయుధాల వాడకం, శత్రు శిబిరాలను ధ్వంసం చేయడం, శత్రువును టార్గెట్ చేసే పద్ధతులు డెమో ద్వారా చేయవలసిన సెక్యూరిటీ జోన్ వ్యూహాత్మకమైన రక్షణ వలయం లో ఉంటూ శత్రు శిబిరాలను టార్గెట్ చేస్తూ విజయం ఎలా సాధించాలో క్యాడే ట్స్ కు శిక్షణ ఇచ్చి వాటి నీ ప్రయోగాత్మకంగా యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో యుద్ధ వాతావరణంలో ప్రయోగాలు చేసి అందర్నీ అబ్బురపరిచారు.అనీ క్యాంప్ కమాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రూప్ ట్రైనింగ్ అధికారులు, ఖమ్మం ,వరంగల్ వివిధ బెటాలియన్ల కమాండింగ్ అధికారులు మరియు క్యాంపు ఆడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే, కెప్టెన్ డాక్టర్ పి సతీష్, కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, సుబేదారి మేజర్ జై రామ్ సింగ్, సౌరస్య, అజీత్ కదం, సందీప్, క్వాటర్ మాస్టర్ సుతారి, సందీప్ పవార్, లెఫ్ట్నెంట్ గణేష్, రాధాకృష్ణ, దినేష్, సంతోష్, నిఖిలేష్, జీవన్, భవాని,సంధ్య, కళ్యాణి, అరుణ, కుమారస్వామి, దత్తు, సతీష్ , మహేష్,నిక్లేష్, మరియు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ,ఖమ్మం జిల్లా అధికారులు పాల్గొన్నారు.