19-09-2025 02:09:44 PM
బెంగళూరు: రాత్రిపూట బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి(heavy rain) శుక్రవారం నగరం స్తంభించిపోయింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం కూడా అడపాదడపా కొనసాగింది. బెంగళూరు నగరంలో ఉదయం 5.30 గంటల వరకు గత 24 గంటల్లో 65.5 మి.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (AWS) 66 మి.మీ. వర్షపాతం నమోదైంది. దొడ్డబళ్లాపురలో 60 మి.మీ, రామనగరలోని చందురాయనహళ్లిలో 46 మి.మీ, బెంగళూరు గ్రామీణంలోని హెస్సర్‌ఘట్టలో 43 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షం వల్ల తాత్కాలిక విద్యుత్తు అంతరాయం, నీరు నిలిచిపోవడం, బలహీనమైన చెట్ల కొమ్మలు విరిగిపడటం వంటివి జరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది.