calender_icon.png 19 September, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న రెజీనా స్కూల్

19-09-2025 02:29:39 PM

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోనీశెట్టి వెంకటేశ్వర్లు 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాలను(government orders) జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల అతిక్రమిస్తున్నారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోనీశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు తేదీ ఈనెల.  22 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రెజీనా స్కూల్(Regina School) యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సెలవులను తగ్గించి, తమ సొంత నిర్ణయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అతి పెద్ద పండుగ దసరా పండుగ సెలవులను పూర్తిస్థాయిలో ఇవ్వకుండా రెజీనా స్కూల్ వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. రెజీనా పాఠశాల దసరా సెలవులను పూర్తిగా అమలు చేసేలా  చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న రెజీనా స్కూల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.