19-09-2025 01:52:32 PM
హైదరాబాద్: తెలంగాణ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఫారెస్టు మినిస్టర్ పేషీలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha ) అధ్యక్షతన ఎకో టూరిజం స్క్రీనింగ్ కమిటీ రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ పొడెం వీరయ్య, అటవీ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(Hoff)డాక్టర్ సువర్ణ, తెలంగాణ ఎఫ్డీసీ ఎండీ సునీత భగవత్, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్), ఏలూ సింగ్ మేరు, సీసీఎఫ్ డాక్టర్ జి. రామలింగం(సోషల్ ఫారెస్ట్), పలు జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థిక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో అనంతగిరి (వికారాబాద్), కనకగిరి (ఖమ్మం), నందిపేట్(నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్టు(నాగర్ కర్నూల్), ముచ్చెర్ల ఎకో పార్కు(నల్గొండ), వైజాగ్ కాలనీ(నల్గొండ), మంజీరా(సంగారెడ్డి), అమరగిరి(నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అమలుపై మంత్రి సురేఖసుదీర్ఘంగా అధికారులతో చర్చించారు.