calender_icon.png 19 September, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్.. రేవంత్ రెడ్డి సర్కార్

19-09-2025 02:27:43 PM

హైదరాబాద్:  తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్(BRS Jubilee Hills constituency) నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు అమలు కావని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్.. రేవంత్ రెడ్డి సర్కార్ అని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఖతం చేస్తే కాంగ్రెస్ ను ఫుట్ బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తోందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సూచించారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేసుడు కాదు.. మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని గుంజుకుంటారని విమర్శించారు. అందుకే మోసగాళ్లను మోసంతోనే జయించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఉన్నదని తెలిపిన కేటీఆర్ 24 నెలల్లో ఒక్క ఇల్లు కట్టలేదు  కానీ రేవంత్ రెడ్డి వేల ఇండ్లు కూలగొట్టిండని ఆయన ద్వజమెత్తారు.