27 July, 2026 | 8:14 AM

రేవ్ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం

30-05-2024 12:11 AM

మరోసారి హేమకు నోటీసులు పంపిన బెంగళూరు పోలీసులు

బెంగళూరు, మే 29: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో నటి హేమ కూడా ఉన్నా.. తన ఆరోగ్యం బాగోలేదని విచారణకు హాజరుకాలేదు. దీంతో జూన్ 1వ తేదీన విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ రోజు విచారణకు హాజరు అవుతారా అనే అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక హేమతో పాటు విచారణకు హాజరుకాని మరో ఏడుగురికి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.