8 April, 2026 | 11:45 AM

ఆరోగ్య సేవలకు ఉత్తమ పురస్కారం

08-04-2026 10:08 AM

జిల్లా కలెక్టర్ చే పురస్కారం అందుకుంటున్న అరుణ

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా విధులను నిర్వర్తిస్తున్న జవ్వాజి అరుణ కుమారి మారుమూల ప్రాంతమైన శెట్టిపల్లి సబ్ సెంటర్ పరిధిలో పని చేస్తూ ఏజెన్సీ ప్రజలకు నిరంతరం వైద్య సేవలను అందిస్తూ, పలు రోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించినందుకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె సేవలను గుర్తించి మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కలెక్టర్ అంకిత్, డీఎం అండ్ హెచ్ఓ తుకారం రాథోడ్ లు అరుణ కుమారికి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారులు మనీష్ రెడ్డి, సుదీప్, వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు అరుణ కుమారికి అభినందనలు తెలిపారు.