అనిల్‌కు ‘ఉత్తమ కవిత అవార్డు’
08-06-2026 01:24 AM
మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాజమండ్రిలో నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన యువకవి వరిపల్లి అనిల్ కుమార్ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటి ’ఉత్తమ కవిత అవార్డు’ కైవసం చేసుకున్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచే కాకుండా, భారతదేశం నలుమూలల నుండి ప్రముఖ కవులు, రచయితలు, పరిశోధకులు, సాహితీవేత్తలు హాజరైన ఈ మహాసభల్లో అనిల్ కుమార్ రాసిన కవితకు ఈ విశిష్ట పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఘనమైన సభలో దేశ విదేశాల సాహితీ దిగ్గజాల సమక్షంలో ఆయనకు ఈ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.






