08-09-2025 12:10:54 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 07(విజయక్రాంతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, మేల్ వార్డుల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంత రం పలువురు రోగులతో మాట్లాడారు.
ఏ అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారని, ఇక్కడ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. తం గళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝాఆదేశించారు.