calender_icon.png 8 September, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడవటంచ స్వాగత తోరణం ప్రారంభం

08-09-2025 12:12:18 AM

సుమారు రూ.20 లక్షలతో నిర్మాణం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మండలంలోని కొడవటంచ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన స్వాగత తోరణం ను ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించి మాట్లాడారు.మండల కేంద్రంలోని ఇందిరమ్మ బొమ్మ వద్ద చిట్యాల కు వెళ్ళే రహదారిలో సుమారు రూ.20 లక్షల ఖర్చుతో ఆర్చి (స్వాగత తోరణం)నిర్మించామని ఎమ్మెల్యే తెలిపారు.

వచ్చే హోలీ పౌర్ణమి వరకు కొడవటంచ దేవస్థానంలో ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలకు పెద్దపీట వేస్తూ వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, కొడవటంచ జాతర చైర్మన్ ముల్కనూరి బిక్షపతి, కొడవటంచ ఈవో ఎస్.మహేష్, రేగొండ టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్సార్ సంపత్ రావు, పున్నం రవి, పట్టేమ్ శంకర్, తిరుమలగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, గంగుల రమణారెడ్డి, బుగులోని జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి పాల్గొన్నారు.