24 July, 2026 | 3:24 AM

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

24-07-2026 12:00 AM
  1. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.50 లక్షలు
  2. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల, జూలై 23 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఐసీయూ, వివిధ వా ర్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి అం దుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, పెరిగిన పొదలను తొలగించి పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. వినియోగంలో లేని పాత వైద్య సామగ్రిని వేలం వేసి తొలగించాలని, పనిచేయని పరికరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు.

ఆసుపత్రి మరమ్మత్తులు, విద్యుత్, రూఫ్ లీకేజీలు, కిటికీలు, తలుపులు, పార్కింగ్ షెడ్ తదితర ప నుల కోసం మంజూరైన రూ.50 లక్షల నిధులతో పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అ వసరమైతే అదనపు నిధులు కూడా మంజూ రు చేస్తామని తెలిపారు. అలాగే రోగుల సహాయకుల కోసం షెడ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం వైద్యాధికారు లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఖాళీ పో స్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని, వి ధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, వైద్యశాఖ ఏఈ రహీం, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.