24 July, 2026 | 3:23 AM

రేడియల్ రోడ్డు-2 భూనిర్వాసితులకు పరిహారం

24-07-2026 12:00 AM

సోలిపేట్, పెద్దవేడు, హైతాబాద్, దామర్లపల్లి, మాచన్పల్లి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.37,11 కోట్లు

చేవెళ్ళ నియోజకవర్గం జులై 23(విజయక్రాంతి): శాబాద్ మండలంలో రేడియల్ రోడ్-2 లో భూములు కోల్పోయిన భూసేకరణ - రైతులకు రూ.37.11 కోట్లకు పైగా పరి హారం ప్రభుత్వం విడుదల చేసింది. నేరుగా సదరు రైతు బ్యాంకు ఖాతాలో వేసింది. ఈ మేరకు చేవెళ్ల ఆర్డీవో పార్థసారధి రెడ్డి ప్రకటన విడుదల చేశారు. శాబాద్ మండల పరిధిలో ప్రతిపాదిత రేడియల్ రోడ్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియకు రైతులు అందించిన  సహకారంతో అవార్డు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

ఇప్పటివరకు 344 మంది రైతుల నుండి సమ్మతి  లభించగా, 228.31 ఎకరాల భూమికి అవార్డుల పక్రియ పూర్తి చేశామన్నారు. గురువారం సోలిపేట్, పెద్దవేడు, హైతాబాద్, దామర్లపల్లి, మరియు మాచన్పల్లి గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.37,11,12,500 (ముప్పు ఏడు కోట్లు, పదకొండు లక్షల పన్నెండు వేల ఐదు వందలు) పరిహారాన్ని జమ చేషేమన్నారు. దీనితో సంబంధిత రైతులు మెరుగైన పరిహారం లబించడంతో అత్యంత శ్రీగ్రంగా పరిహారం అందించడంతో సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

అలాగే షాబాద్, బోనగిరపల్లి నాగర్కుంట గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం నేటి నుండి జమ చేయబడతాయని అంతే కాకుండా, ఇంటి స్థలాలు కూడా అతి త్వరలో అందించ బడుతాయన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియకు స్వచ్ఛందంగా సహకరించిన రైతులు ప్రజా ప్రతినిదులకు జిల్లా యంత్రాంగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు. మిగత రైతులు కూడా ఇదే విధంగా సహకరించి ప్రజాప్రయోజనకరమైన రేడియల్ రోడ్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి తోడ్పడాలని ఆర్ డిఓ కోరారు.