అభ్యాసంతో మెరుగైన ఫలితాలు
08-07-2026 12:00 AM
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్నగర్, జూలై 7: విద్యార్థుల అభ్యాసంతో మెరుగైన ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం నగరం లోని బోయపల్లి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి, శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయబోతున్న ప్రీ-లిటరసీ, ప్రీ-న్యూమరసీ ఆధారిత బేసిక్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధులు కార్యక్రమం వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం, ఎంఈఓ లక్ష్మణ్ సింగ్, శిక్షణ ఫౌండేషన్ ప్ర తినిధులు, కాశీనాథ్ సీనియర్ ఆపరేషన్ మే నేజర్, యాదప్ప జిల్లా మేనేజర్, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.






