8 July, 2026 | 2:01 AM

ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం

08-07-2026 12:00 AM

బడంగ్‌పేట్, జూలై 7 (విజయక్రాంతి): బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, అలాగే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డా. మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధి, బాలాపూర్ మండల ఇంచార్జీ బోర్ర రవి మాదిగ ఆధ్వర్యంలో విష్కరణ దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య, సరూర్ నగర్ మాజీ ఉపాధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు శ్రీరాములు, ఆంజనేయులు, ఉమేష్, రమేష్, ఇబ్రహీం, అంజయ్య. 

బిఆర్‌ఎస్  నాయకులు రాజు, అరవింద్, ఎమ్మార్పీఎస్ నేతలు శ్రీశైలం, సుధాకర్, పుల్లయ్య, నరసింహ, ఉపేందర్, ఆనంద్, సురేష్, సంజీవ, చిన్న శ్రీరాములు, ఓల్ సిటీ ఇన్చార్జ్ నరసింహస్వామి, భాను, ఇబ్రహీం, వేణు, జనార్దన్, అంజి, మల్లేష్, చందు తదితరులు పాల్గొన్నారు.