‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, జూలై 7 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ను పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అధికారులను కోరారు.హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ గూడ సుఖసాగర్ అపార్ట్మెంటులో మంగళవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమా నికి ఆయన హాజరయ్యారు. బీఎల్‌ఓ అరుణ, బీఎల్‌ఏ మీర్జాతో కలిసి ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా పరిశీలన జరగాలని ఆకాంక్షించారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని పేర్కొన్నారు.
ప్రతి ఓటరు కూడా తమ ఓటరు వివరాలను సరి చూసుకోవాలన్నారు. అవసరమైన వారు మార్పు లు చేర్పులు చేసుకోవాలని సూచించారు. అందుకు బీఎల్‌ఓ, బీఎల్‌ఏల సహాయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్, డి.రాజేందర్, సుశాంత్, చింటూ, కార్తీక్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.






