మెరుగైన సేవలు అందించాలి
- అంకితభావంతో పనిచేయాలి
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్
- కోఠి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి సందర్శన
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ బుధవారం హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) వైద్యశాలను సందర్శించారు. వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రి పనితీరును పరిశీలించి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని విన తులను స్వీకరించారు. పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోజూ సుమారు వెయ్యి మందికి పైగా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజారోగ్యానికి విశేష సేవలు చేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ఆయన అభినందించారు. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఇదే అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆయనవెంట డాక్టర్ బెంజిమన్, డాక్ట ర్ రవిశంకర్, ఆర్‌ఎంఓ డాక్టర్ అనిల్ కుమా ర్, టీఎన్జీవో ఈ ఎన్ టి అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, రవి, శ్రీనివాస్ ఉన్నారు.






