అమీన్‌పూర్‌ను ఆదర్శ సర్కిల్‌గా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి
అమీన్‌ఫూర్, జూలై 22 : అమీన్పూర్ సర్కిల్-47 పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.16.53 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమీన్ పూర్ ను జీహెచ్‌ఎంసీలో ఆదర్శ సర్కిల్గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు శశికల యాదవ రెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, అమీన్ పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం మహిళా భవనంలో కొనసాగుతోందని, 2022లో కొత్త భవన నిర్మాణానికి 2 ఎకరాల 2 గుంటల స్థలం కేటాయించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే వాటర్ వరక్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాకే సీసీ రోడ్లు వేస్తే ప్రభుత్వ నిధులు వృథా కాకుండా ఉంటాయని సూచించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.130 కోట్ల ఎస్టీపీ ప్రాజెక్టు కోసం చిట్కుల్లో 15 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారని, అవసరమైతే బీహెచ్‌ఈఎల్లో ఇప్పటికే ఉన్న ఎస్టీపీ వినియోగంపై కూడా పరిశీలించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ అమీన్ పూర్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అమీన్ పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, స్మశానవాటిక అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
బీరంగూడ డివిజన్కు రూ.9.03 కోట్ల నిధులు మంజూరు కావడంపై రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీరంగూడ, అమీన్ పూర్ ప్రాంతాలను ఆదర్శ ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.






