2 July, 2026 | 2:00 AM

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి

02-07-2026 12:53 AM

 జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూలై 1 (విజయక్రాంతి): వైద్యులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్ట రేట్లో  జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను సన్మానించారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్న వైద్యుల సేవలు ఎనలేనివని అన్నారు.అన్ని వృత్తుల్లో వైద్య వృత్తి అత్యంత గొప్పదని జిల్లా కలెక్టర్ అన్నారు.

భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న ప్రముఖ వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు,  జయంతి, వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యం, సేవాభావంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

రోగుల పట్ల మానవత్వం, సహానుభూతితో వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.  వైద్యులు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటి, డిసి హెచ్‌ఓ గోపాల్,, వైద్యాధికారులు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.