అక్రమ నిర్మాణాల కూల్చివేత
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపడితే సహించం
కాప్రా మండల తాసీల్దార్ మతిన్ హెచ్చరిక
జవహర్ నగర్, జూలై 1 (విజయక్రాంతి): జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తే సహించబోమని కబ్జాదారుల పని పడతామని, అక్రమ దారుల ఆగడాలను ఇకపై సహించబోమని కాప్రా మండల తాసిల్దార్ మతిన్ హెచ్చరించారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయనే సమాచారం మేరకు కాప్రా మండల తాసిల్దార్ మతిన్ ఆదేశాల మేరకు బుధవారం గిర్ధవార్ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో పలు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ సర్కారు భూములను అమాయక పేదలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై ప్రత్యేక నజరు పెట్టామని త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై జవహర్ నగర్ లో ఎలాంటి అక్రమ కట్టడాలను చేపట్ట రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






