కిమ్స్ వైద్యులకు సత్కారం
02-07-2026 12:52 AM
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హై దరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక జోనల్ హెడ్ (జనరల్ మేనేజర్) ఎం. పిచయ్య సికింద్రాబాద్‌లోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో క్లినికల్ డైరెక్టర్, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జ న్ డాక్టర్ నరేంద్రనాథ్ మెడాను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎం పిచయ్య మాట్లాడుతూ..
దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కు వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వైద్యుల ఆర్థిక అవ సరాల కోసం ప్రత్యేక డాక్టర్స్ లోన్స్, ప్రయారిటీ బ్యాంకింగ్ సేవలు వంటి సౌకర్యాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోందని తెలిపారు.






