నకిలీ జాబ్ ఆఫర్లతో జాగ్రత్త
నిరుద్యోగులను హెచ్చరించిన ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి
చిన్న చింతకుంట: ప్రస్తుతం సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న ఉద్యోగ మోసాల పట్ల స్థానిక పోలీసులు ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగ యువతనుఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఆకర్షణీయమైన జీతాలు, ఇంట్లో కూర్చుని పని చేసే సులభమైన పద్ధతులంటూ వల వేసే సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ తాజాగా ఒక అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు.
మండలం ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి సూచించిన ముఖ్యమైన అంశాలు....
సోషల్ మీడియా ప్రకటనలు నమ్మొద్దు
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే ప్రతి జాబ్ ఆఫర్ నిజం కాకపోవచ్చు. కంపెనీల విశ్వసనీయతను తనిఖీ చేయకుండా స్పందించవద్దు.
ఆన్‌లైన్ టాస్క్ మోసాలు "ఆన్‌లైన్ టాస్కులు పూర్తి చేస్తూ లక్షలు సంపాదించవచ్చు" అని వచ్చే మెసేజ్‌లను అస్సలు నమ్మకండి. ప్రారంభంలో చిన్న మొత్తంలో డబ్బులు ఇచ్చి, తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేయడం వీరి స్టైల్.
ఈజీ మనీ ఆశ ప్రమాదకరం
కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. త్వరగా డబ్బు వస్తుందంటే అక్కడ ఏదో మోసం ఉందని గ్రహించాలి.
అప్రమత్తతే రక్షణ
ఏ ఉద్యోగానికైనా అప్లై చేసే ముందు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించండి. మీ బ్యాంక్ వివరాలు, ఓటిపి (OTP)లు ఎవరికీ షేర్ చేయవద్దు.
మోసపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీరు ఇలాంటి ఉద్యోగ మోసానికి గురైతే లేదా ఎవరైనా మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.
నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్: 1930
అధికారిక వెబ్‌సైట్ www.cybercrime.gov.in "గుర్తుంచుకోండి.. మీ అప్రమత్తతే మీకు రక్ష!" అని తెలంగాణ ఎస్సై స్పష్టం చేశారు.




