24 June, 2026 | 2:14 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

భద్రాద్రి యాడ్స్ సంస్థ మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలి

15-06-2025 05:26 PM

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని..

ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన బస్సు షెల్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్ధం భద్రాద్రి యాడ్స్ సంస్థ స్వచ్చందంగా బస్సు సెల్టర్లను నిర్మించి ప్రజలకు అంకితం చేయడం అభినందనీయమని, ఈ సంస్థను ఆదర్శనంగా తీసుకొని ఇతర సంస్థలు, ఆర్ధిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు తమ సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ క్రాస్ రోడ్డు, ఇల్లందు, పాల్వంచ క్రాస్ రోడ్డులో భద్రాద్రి యాడ్స్ సంస్థ నిర్మించిన మూడు బస్సు షెల్టార్లను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ... బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి వారికి నీడ కల్పించాలనే సదుద్దేశంతో బస్సు షెల్టార్లను నిర్మించారని, వీటి నిర్వహణ భాధ్యత గ్రామపంచాయతీలకు, అధికారులకుంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని 13 ప్రధాన సెంటర్లలో బస్సు షెల్టర్ల నిర్మాణంకోసం నిధులు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఎంపిడివో అంకుబాబు, ప్రొఫెసర్ పూర్ణచందర్ రావు, విద్యుత్ శాఖా ఏఈ రఘురామయ్య, స్థానిక నాయకులు పెదబాబు, కూచిపూడి జగన్, పూనెం శ్రీను, గౌస్ పాషా, కృష్ణ, మిర్యాల రాము, లగడపాటి రమేష్, రామారావు, దేవరగట్ల రాంబాబు, హరి, మండే హన్మంతరావు, భద్రాద్రి యాడ్స్ సంస్థ వ్యవస్థాపకులు డేవిడ్ రాజు, నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.