విగ్రహ రూపంలో తండ్రి తనయులు
15-06-2025 | 05:44pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన డోర్నకల్ మండలం(Dornakal Mandal) దుబ్బ తండ గ్రామానికి చెందిన తండ్రి తనయులు బాలు నాయక్, సాయి నిరంతరం తమ కళ్లెదుటే నిలిచి ఉండే విధంగా బంధువులు శిలా విగ్రహాలను గ్రామంలో ఏర్పాటు చేయించారు. తండ్రి తనయుల శిలా విగ్రహాలను డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆవిష్కరించి నివాళులర్పించారు.






