7 March, 2026 | 4:19 PM

Breaking News

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •   ఎల్‌పీజీ ధరల పెంపు.. నిరసనకు మమత పిలుపు   •  

రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు భద్రాద్రి జిల్లా ఉపాధ్యాయులు

06-03-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి5 (విజయక్రాంతి): ఫిబ్రవరి’ 28 జాతీయ వైజ్ఞానిక దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్ సిఈఆర్టి)ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సదస్సునకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి సైన్సు ఉపాధ్యాయులు విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి,‘ డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ , క్రిటికల్ థింకింగ్‘ అనే అంశంపై సెమినార్ పత్రాలను సమర్పించారు.

ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ముగ్గురు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత కొత్తగూడెంకు చెందిన గుంటి అనురాధ, జడ్పీహెచ్‌ఎస్ మణుగూరుకు చెందిన కలం పరమయ్య , ఏజిహెచ్‌ఎస్ సోంపేటకు చెందిన ఎం.పార్వతి  ఎంపికయ్యారని భద్రాద్రి జిల్లా సైన్స్ అధికారి సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 28న ఎస్సిఈఆర్టి హైదరాబాదు నందు జరిగే వైజ్ఞానిక వేడుకలలో మీరు ముగ్గురు వారి సెమినార్ పత్రాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

వీరికి భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి. నాగలక్ష్మి ,విద్యాశాఖ మానిటరింగ్ అధికారులు నాగరాజు శేఖర్, సైదులు, మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు అభినందించారు.