3 July, 2026 | 11:35 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

పర్యావరణపై అవగాహన కార్యక్రమం

06-03-2026 12:00 AM

బూర్గంపాడు, మార్చి5 (విజయక్రాంతి): మండలంలోని పినపాక పట్టినగర్, ఉప్పుసాక గ్రామాలలో గురువారం సిఎస్‌ఐఆర్ - ఐఐసిటీ ఈఐఎసిపి ఆర్ పి బృందం పర్యావరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఎస్‌ఐఆర్ - ఐఐసిటీ పీహెచ్డీ విద్యార్థి సంపత్ వాతావరణ మార్పు, ప్రజారోగ్యంపై దాని ప్రభావం మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను అనుసరించాలని రైతులను ప్రోత్సహించారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు రైతులకు గుడ్డ సంచులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పినపాక పట్టి నగర్ సర్పంచ్ బానోత్ పద్మ, పంచాయతీ సెక్రెటరీ రమేష్, యువ నాయకుడు బానోత్ వెంకట్, సిఎస్‌ఐఆర్ - ఐఐసిటీ పీహెచ్డీ విద్యార్థులు దీప్తి, సంపత్, శ్రీలేఖ, ప్రవీణ్, గ్రామస్తులు దరావత్ శ్రీను, దోమల వీరబాబు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.