30 March, 2026 | 4:31 PM

ఆపదలో ఆపన్న హస్తం...

30-03-2026 02:56 PM

చిన్నారి చికిత్సకు జాన్సన్ నాయక్ ఆర్థిక సహాయం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం శాంతినగర్ కాలనీకి చెందిన ఒక చిన్నారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని స్పందించిన బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సకు అయ్యే ఆర్థిక సహాయం అందజేశారు. కడెం మండలం ధర్మాజీపేట గ్రామ వాస్తవ్యులైన కడారి శివకుమార్, శిరీష, దంపతులు కొంతకాలంగా ఖానాపూర్ పట్టణం శాంతినగర్ లో నివసిస్తున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కడారి బన్నీ కొంతకాలంగా తీవ్రమైన మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండగా తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు గతంలో  వారికి హామీ ఇచ్చిన ప్రకారం ఆ కుటుంబాన్ని పరామర్శించి చిన్నారి వైద్యానికి భరోసా ఇచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై జీవితాంతం ఈ సహాయం మేము మర్చిపోలేము అని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.