హంసవాహనంపై భద్రకాళి
14-05-2024 01:41 AM
వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
వరంగల్, మే 13 (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతు న్నాయి. వేడుకలలో భాగంగా ఐదో రోజు సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంకాలం హంస వాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమానికి బాకరాజు రాజశ్రీ చంద్రశేఖర్‌రావులు ఉభయదాతలుగా వ్యవహరించారు.




