8 April, 2026 | 5:32 PM

ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

08-04-2026 03:40 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గ్రామ సర్పంచ్ సంజీవరావు,మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైతులు విక్రయించి లాభదారకరమైన మద్దతు ధర పొందాలని తెలిపారు. పూర్తి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏ రకం ధాన్యం ధర క్వింటాల్కు 2389, బీ,,రకం దాన్యం ధర క్వింటాల్కు 2369 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకోవాలన్నారు.