ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!
08-04-2026 03:36 PM
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులు(Indians) ఇరాన్ నుండి త్వరితగతిన నిష్క్రమించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహా జారీ చేసింది. రాయబార కార్యాలయం భారత పౌరులకు అత్యవసర సూచన చేసింది. ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా రావాలని వెల్లడించింది. భారత ఎంబసీని(Embassy of India) సంప్రదించకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఎంబసీ హెల్స్ లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీని భారత్ అందుబాటులోకి తెచ్చింది. భారతీయ పౌరులు అధికారిక తాజా సమాచారాన్ని నిశితంగా గమనించాలని అధికారులు సూచించారు.
రాయబార కార్యాలయం మొబైల్ నంబర్లు: +989128109115, +989128109109, +989128109102, +989932179359
రాయబార కార్యాలయ ఈమెయిల్: cons.tehran@mea.gov.in




