8 April, 2026 | 5:32 PM

ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

08-04-2026 03:43 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక ఈనెల 21న మంగళవారం ఎన్నుకోవడం జరుగుతుందని జిల్లా హడ్ హాక్ కమిటీ సభ్యులు గాజుల జక్కయ్య,గడ్డల శంకర్ లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన  ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 21న జరిగే జిల్లా కమిటీ ఎన్నికకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి మున్నూరు కాపులు హాజరు కావాలని అన్నారు.

జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదరికి పోటీలో ఉన్నవారు ఉదయం వచ్చి పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. మున్నూరు కాపులు ఐక్యమత్యతో ఉండి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్, సిర్పూర్ నియోజకవర్గం అధ్యక్షులు సుంకరి తిరుపతి, నాయకులు వెంకటేశ్వర్లు, తిరుపతి, మధుకర్, సురేష్, వెంకన్న, సదాశివ్, పోషన్న, ప్రభాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.