భగ్గుమంటున్న భానుడు

21-04-2024 01:05:12 AM

సూర్య ప్రతాపానికి అల్లాడిపోతున్న ప్రజలు

ఖాళీగా దర్శనమిస్తున్న రోడ్లు 

బయటకు రావాలంటే భయం

చర్ల, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : భాను డు భగ్గుమంటున్నడు. నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన పది రోజులుగా తీవ్రత పెర గడంతో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటిస్తూ సూర్య ప్రతాపం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఎండ తాకిడికి మంచినీరు, నిమ్మరసాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నా రు. ఏప్రిల్‌లోనే పరిస్థితులు ఇలా ఉన్నాయంటే మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 

అధిక ఉష్ణోగ్రతలతో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో విపరీతమైన ఉక్కపోతతో ఉపిరాడటం లేదని ప్రజలు వాపోతున్నారు. పనులు చేసుకొని పూట వెళ్లదీసుకునే వారు సైతం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్న పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దాదాపుగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలకు వడదెబ్బకు గురవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, నిర్లక్ష్యంగా ఉంటే మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు బాగా పెరగడంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేక.. అలా అని బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ప్రజలు గొడుగులు, కర్చీఫ్‌లు, కళ్లజోళ్లు వం టివి రక్షణగా వాడుతున్నారు. చర్ల ఏజెన్సీ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో వేడి మరింత ఎక్కువగా వుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చి నెల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.