21 May, 2026 | 6:01 AM

వైద్యునికి రూ. 12 లక్షలకు కుచ్చుటోపీ

21-04-2024 01:05 AM

l ముంబై సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ ఫోన్ కాల్..

l మోసపోయానని గ్రహించి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పేరు చెప్పుకొని నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల చేతిలో నగరానికి చెందిన ఒక డాక్టర్ మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సైబర్ క్రైమ్ డీసీపీ పేరిట ఓ సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ డాక్టర్‌కు ఫోన్ చేసి రూ.12 లక్షలు కాజేశాడు. ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. బాధితుడి ఆధార్ అనుసంధానంగా పలు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటి నుంచి రూ.8 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని బెదిరింపులకు పాల్పడ్డాడు.

మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదైందని, రూ.12 లక్షల 75 వేలు చెల్లించాలని డాక్టర్‌ను డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన డాక్టర్ వారు కోరిన మొత్తాన్ని చెల్లించి.. చివరకు మోసపోయినట్లు గ్రహించాడు. అనంతరం బాధిత డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ మోసాలు, నేరగాళ్లపై అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.