21 May, 2026 | 8:09 AM

ధూల్‌పేట్‌లో 160 కిలోల నల్లమందు పట్టివేత

21-04-2024 12:59 AM
  • రూ.1.50 కోట్ల విలువ ఉంటుందని అంచనా

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై హైదరా బాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒకచోట మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని ధూల్‌పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు రూ.1.50 కోట్ల విలువై న 160 కిలోల నల్లమందును స్వాధీ నం చేసుకొని ఇద్దరు నిందితులు తేజరామ్, దేవంద్రకస్‌ను అదుపు లోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లో పరాస్ అనే ప్రధాన నిందితుడి  నుంచి నగరానికి నల్లమందు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

గసగసాల పంటను పండించి వాటి ద్వారా హెరాయిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గత 15 రోజులుగా నగరానికి నల్లమందు సరఫరా అవుతుందనే సమాచారం మేరకు కాపు కాసి నిందితులను పట్టుకున్నారు. 1 గ్రాము నల్ల మందు రూ.1000 చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్ల డించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ అధికారులను అభినందిం చారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు.