16 July, 2026 | 9:12 AM

'కల్కి' నుంచి ‘భైర‌వ యాంథెమ్’ ఫుల్ వీడియో

17-06-2024 03:07 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్​ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి ఏడీ 2898. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కల్కి నుంచి ఫ‌స్ట్ సింగిల్ భైర‌వ యాంథెమ్ ఫుల్ వీడియోను చిత్రయూనిట్ సోమవారం విడుద‌ల చేసింది. ఇక ఈ పాటను ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు విడుద‌ల అయి, యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.