16 July, 2026 | 9:19 AM

గురుశిష్యుల నేపథ్యంలో

17-06-2024 12:30 AM

రాజేంద్రప్రసాద్, శ్యామ్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ‘నిమ్మకూరు మాస్టారు’ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. గురుశిష్యుల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేశ్ మనవడు శ్యామ్ సెల్వన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. అముదేశ్వర్ దర్శకుడిగా జె.ఎం. సినీ ఫ్యాక్టరీ పతాకంపై జె.ఎం.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి స్వరకర్తగా వ్యవహరిస్తున్న మాధవపెద్ది సురేశ్ మాట్లాడుతూ “మా కుటుంబం నుంచి ఐదవ తరానికి చెందిన వ్యక్తి సినిమాల్లోకి వస్తున్నాడు. నా తొలి సినిమా ‘హైహై నాయకా’ నుండి నా ప్రయాణంలో భాగమైన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు” అని తెలిపారు. ఈ నెల 25 నుంచి రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరణ జరుగనున్న ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.