6 August, 2026 | 1:24 AM

భక్తి సన్మార్గంలో నడిపిస్తుంది

27-05-2024 12:25 AM

మహబూబ్‌నగర్, మే 26 (విజయక్రాంతి): భక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడి పిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాలకొండ చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతిక జీవనంలో మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన మనిషికి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, లక్ష్మ ణ్ యాదవ్, పటేల్ శ్రీనివాస్‌రెడ్డి, శివుడు, ఆంజనేయులు, గోపాల్, శ్రీను, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.