తండ్రి కళ్లముందే కొడుకు మృతి
పటాన్‌చెరు, మే 26 : గేదెల కు నీళ్లు తాపేందుకు కుంటలోకి వెళ్లి కాలుజారి పడిన కొడుకును ఈత రాని తండ్రి రక్షించలేక అరుస్తుండగానే కొడుకు నీట మునిగి శవమయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలలోకి వెళ్తే.. గుమ్మడిదల గ్రామా నికి చెందిన స్వామి, నాగరాణిల కొడుకు వినోద్(10) ఆదివారం ఉదయం తండ్రితో పాటు గేదెలను మేపేందుకు వెళ్లా డు.
గుమ్మడిదల శివారులోని బ్రాహ్మణ కుంటలో బర్లకు నీళ్లు తాపేందుకు వెళ్లగా వినోద్ కాలు జా రి కుంటలో పడిపోయాడు. వెంటనే తండ్రి స్వామి పరుగెత్తుకొని వచ్చి వినోద్ అని అరుస్తూ గుండెలవిలిసేలా రోదించాడు. స్వామికి ఈత రాకపోవడంతో కళ్లముందే కన్నకొడుకు మృతి చెందాడు. గ్రామస్తులు వచ్చి వినోద్‌ను బయటకు తీశారు. నిమిషాల వ్యవధిలోనే కన్న కొడుకు విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.






