అగ్ని ప్రమాదంపై విచారణ
పటాన్‌చెరు, మే 26 (విజయక్రాం తి): గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని స్క్రాప్ గోదాం లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్సై మహేశ్వర్‌రెడ్డి దగ్దమైన స్క్రాప్ దుకాణాన్ని ఆదివారం ఉదయం పరిశీలించారు. బొంతపల్లిలోని సర్వే నంబ ర్ 227లో చుట్టూ ప్రహారీ గోడ ఉన్న ఖాళీ స్థలంలో ఆరు నెలల క్రితం స్క్రాప్ దుకాణం ఏర్పాటు చేసినట్లు యజమాని ఎండీ ఎజాజ్ తెలిపారు.
శనివా రం రాత్రి 7:20 ప్రాంతంలో స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నట్లు స్క్రాప్ దుకాణంలో పనిచేసే ఎండీ ఇలియాస్ తనకు ఫోన్ చేసి చెప్పాడని, వెంటనే తాను వచ్చి ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చానని దుకాణం యజమాని ఎజాజ్ తెలిపారు. ఈ ప్రమా దంలో ప్లాస్టిక్, ఇనుప డ్రమ్ములు, ఇతర వస్తువులు పగిలి పోయాయని పేర్కొన్నారు. ఎజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






