భారత్ గ్యాస్ వినియోగదారులు కేవైసీ చేసుకోవాలి
గణపురం ఆగస్టు 7 (విజయ క్రాంతి) : భారత్ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ నెల 15 లోగా తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని భారత్ గ్యాస్, గణపురం డీలర్ బొద్దుల భారతి, శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. భారత్ గ్యాస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆగస్టు 15 లోగా గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో గ్యాస్ బండ తోపాటు సబ్సిడీ రాదని తెలిపారు.
అంతేకాకుండా అట్టి వినియోగదారుడు కమర్షియల్ ధర రేటుకు సిలిండర్ తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం కేవైసీ చేయించాలని చెప్తున్నప్పటికీ వినియోగదారులు జాప్యం చేస్తున్నారన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 లోపు కేవైసీ చేయించుకోవాలని, మీ సమీపంలోని గ్యాస్ డీలర్ల వద్ద గాని, గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద గాని కేవైసీ చేయించుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు గణపురంలోని భారత్ గ్యాస్ కార్యాలయంలో సంప్రదించాలని భారతి, శ్రీనివాస్ తెలిపారు.






