7 April, 2026 | 2:21 AM

కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవం

07-04-2026 12:00 AM

ముకరంపుర, ఏప్రిల్ 6(విజయ క్రాంతి)  భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యపురి కాలనీలోని తన నివాసం వద్ద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజ య్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించా రు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్,రాష్ట్ర బీజేపీ అధికార ప్ర తినిధి & డిప్యూటీ మేయర్ యాదగిరి సునీ ల్ రావు,బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ,నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.జెండా ఆవిష్కరణ అ నంతరం నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.