7 April, 2026 | 2:19 AM

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

07-04-2026 12:00 AM

సదాశివనగర్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు సదశివానగర్ మండల శాఖ తరపున అధ్యక్షులు కుంట రాంరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వందేమాతర గీతన్ని ఆలపించి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ తిరుమల చక్రధర్ గౌడ్, జిల్లాల రమేష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ పొలబోయిన సాయిలు, సర్పంచ్ శిరీష రవి,మోహన్ రాజ్,గ్రామ అధ్యక్షులు గంగాధర్, నరేందర్ నారాయణ,బస్వయ్య, సాగర్, నవీన్, ధరంపురి, భాస్కర్, సాయిలు, శ్రీను, సాయి, మహేష్, మధుసూదన్, బీరయ్య, గంగయ్య,శక్తి కేంద్రం ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

గాంధారిలో ..

గాంధారి , ఏప్రిల్ 06 ( విజయ క్రాంతి ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన అతిపెద్ద పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ చాలా పటిష్టంగా ఉందని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పోతంగల్ కిషన్ రావ్, మాజీ మండల అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్, తిమ్మాపూర్ ఉప సర్పంచ్ సంజీవులు, గాంధారి పట్టణ అధ్యక్షుడు గంగి రమేష్, శేఖర్,సుధాకర్, మోజిరాం, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బాన్సువాడలో ..

బాన్సువాడ, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బాన్సువాడ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షు డు కోణాల గంగారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. 

జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపా ధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కిసాన్ విభాగం జిల్లా కార్య దర్శి మోహన్‌రెడ్డి, మున్సిపల్ సభ్యు డు గజ్జల మహేష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, మాజీ జిల్లా ఉపా ధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్య దర్శి చిరంజీవి,సిద్దీ బాలరాజ్, నాయకులు చీకట్ల రాజు, పాశం భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కొండని గంగారం, శంకర్, మహేందర్, రఘువీర్, నాగరాజు, సాయి రెడ్డి, పురుషోత్తం, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.