07-12-2025 02:39:30 PM
హైదరాబాద్: మదీనగూడలో నాలా ఆక్రమణల తొలగింపును హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) చేపట్టింది. ఆదివారం మియాపూర్ పటేల్ చెరువు నుంచి గంగారం చెరువు వరకు నాలా ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. మదీనగూడలో నాలా ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు నాలా పరిశీలించి, ఆక్రమణల తొలగించారు.