calender_icon.png 10 November, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేసులో భట్టి, మహేష్

10-11-2025 12:12:24 AM

  1. మొన్నటి వరకు ఒక్కరే.. ఇప్పుడు ఇద్దరు..
  2. సీఎం మీట్ ది ప్రెస్‌లో బూతు పంచాంగం
  3. చంద్రబాబు, వైఎస్‌ఆర్ ఇద్దరూ నచ్చడం విడ్డూరం
  4. పీజేఆర్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు
  5. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కొత్త బూతు పంచాంగం తప్ప ఇంకొకటి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినట్టు తిరుగుతున్నారని, అది స రిపోదన్నట్టు మీట్ ది ప్రెస్ నిర్వహించారని ఎద్దేవా చేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. మొన్నటి దాకా భట్టి విక్రమార్క మాత్రమే సీఎం రేసులో ఉండేవారని, కానీ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కూడా పోటీలో ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్టీసీని రూ.7 వేల కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చానని, 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం ప్రచారం చేస్తు న్నారని, ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు జూ బ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎందకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ కట్టిన భవనాలతో ఉద్యోగాలు వచ్చాయా అని రేవంత్‌రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు బిల్డింగ్‌లను చూసే ఇచ్చారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, వైఎస్‌ఆర్‌లిద్దరూ రేవంత్‌రెడ్డికి నచ్చడం విడ్డూరంగా ఉందన్నారు. పీజేఆర్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు ఉందా, ఆయనను చంపిందే కాంగ్రెస్ కదా అని గుర్తు చేశారు. 2004-14 పాలన స్వర్ణయుగం అనడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు.

అది ఆత్మహత్యలు, ఆకలి చావుల కాలం కాదా, మహబూబ్‌నగర్‌లో ఆకలి చావులు కనబడలేదా? అని అన్నారు. వలసల బాట ను వ్యవసాయ బాటగా మార్చిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారా, ప్రాజెక్టుల రిబ్బన్ కట్ చేసే ముందు కేసీఆర్, కేటీఆర్‌ను గుర్తు చేసుకోవాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. కేసీఆ ర్, కేటీఆర్ వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు.

ప్రస్తుతం 24 గంటల కరెంటు ఇస్తున్నామని, అందుకే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని  చెప్పుకో వడానికి సిగ్గుండాలన్నారు. రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్‌కు రాష్ట్రం అప్పగించారని చెబుతున్నారని, అప్పటి బడ్జెట్ కూడా అంత లేదన్నారు. రేవంత్‌రెడ్డికి చదువు రాకపోతే తెలిసిన వాళ్లను అడిగాలని సూచించారు. కేసీఆర్ హయాంలో ప్ర పంచ చిత్రపటంలోనే తెలంగాణ అనడం కం టే అబద్ధం మరొకటి ఉంటుందా అని పేర్కొన్నారు.

నిజాలు చెబుతున్న రైతులను బోర బండలో ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. మానసిక రోగికి మించిన రోగి రేవం త్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక శాస్త్రవేత్తలకు రేవంత్‌రెడ్డి మంచి రీసెర్చ్ సబ్జెక్టు అని, ఇంత తెలివి తక్కువగా మాట్లాడే సీఎం ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. రోడ్‌షోలల్లో కేటీఆర్‌కు స్వాగతం చెబుతున్న ప్రజలను చూసి రేవంత్‌రెడ్డికి మైండ్ దొబ్బిందన్నారు. గోపినాథ్ కుటుంబ సభ్యుల గురించి దిగజారుడు మాటాలెందుకని, అవి ఓట్లు  తీసుకొస్తాయా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ వాళ్లకే సీఎం తీరుతో విసుగొచ్చిందన్నారు. ఆర్. కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగకు మొత్తం అధికారం ఇచ్చి దిగిపోవాలని, ఇంకెవరికీ సీఎం పదవి ఇచ్చినా రేవంత్‌రెడ్డి కన్నా బాగా చేస్తారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రెండేళ్లలో రూ. 30 వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. నిర్మాణ రంగం కుదేలవడంతో లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారని, రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకాదని విమర్శించారు. రేవంత్‌రెడ్డివి తెలివి తక్కువ, సోయి లేని మాటలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్టు ఉందన్నారు.