10-11-2025 12:24:10 AM
కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం
కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, రియల్ ఎస్టేట్ పతనం, అభివృద్ధి కుంటుపాటు
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. ‘బెంగాల్ ఈరోజు ఆచరిస్తుంది, రేపు దేశం అనుసరిస్తుంది’ అనే పాత నానుడిని మార్చి, ‘తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది, రేపు దేశం అనుసరిస్తుంది’ అని కేసీఆర్ తన పాలనతో నిరూపించారని ఆ యన పేర్కొన్నారు.
అదివారం ఎర్రగడ్డలోని మోతీ నగర్‌లో ఉన్న వాసవి బృందావనం అపార్ట్‌మెంట్‌వాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. “తెలంగాణ ఏర్పడినప్పుడు, నీళ్లు లేక, కరెంట్ లేక ఈ రాష్ట్రం బతకదని ఎన్నో అనుమానాలు వెలిబుచ్చారు. కానీ, కేసీఆర్ గారు మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందించి, ఓట్లు అడగను అని చెప్పిన ఏకైక నాయకుడిగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వమే మన పథకాన్ని ’హర్ ఘర్ కో జల్’ పేరుతో కాపీ కొట్టింది.
’మిషన్ కాకతీయ’తో చెరువులను పునరుద్ధరించి వ్యవసాయానికి ఊపిరి పోశాం. దాని ఫలితంగా, కరువు నేలగా ఉన్న తెలంగాణ నేడు దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించే రాష్ట్రంగా అవతరించింది” అని హరీశ్‌రావు వివరించారు. “2014లో రూ.1,24,000గా ఉన్న తలసరి ఆదాయం, 2023 నాటికి రూ .3,74,000కు పెరిగి తెలంగాణ అగ్రస్థానం లో నిలిచింది. జీఎస్డీపీ వృద్ధిలో, రాష్ట్ర సొంత పన్నుల రాబడిలో మనం నంబర్ వన్‌గా నిలిచాం” అని చెప్పారు.
“కేసీఆర్ పా లనలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి లైన్లు కడితే, నేటి కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువుల కోసం లైన్లలో ని ల్చుంటున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తెనే స్వయంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్‌ను గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ అనుమతులకు 30% కమీషన్ డిమాండ్ చేస్తుండటంతో ఈ రంగం నాశనమవుతోంది” అని తీవ్ర ఆరోపణలు చేశారు.
లేడీ వర్సెస్ రౌడీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను లేడీ వర్సెస్ రౌడీగా హరశ్‌రావు అభివర్ణిస్తూ.. “మీరందరూ ఆదరించిన మా గంటి గోపీనాథ్ దురదృష్టవశాత్తూ మన మధ్య లేరు. ఆయన కుటుంబానికి, పిల్లలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి, వారి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణ లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో వారి కుటుంబ సభ్యులను బైండోవర్ చే యడమే వారి రౌడీయిజానికి నిదర్శ నం’ అని విమర్శించారు.
సునీత మ్మ ఒక్కరే కాదు. ఆమె వెంట కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం ఉంది. జూబ్లీహిల్స్‌లో సునీతమ్మను గెలిపిస్తే, అది రాష్ట్రం మొత్తానికి మేలు చేస్తుంది. ఇక్కడ బీఆర్‌ఎస్ గెలిస్తే, కాం గ్రెస్ తన ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాల్సి వస్తుంది. ప్రజలు మళ్లీ బీఆ ర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు’ అని హరీశ్‌రావు అన్నారు.