calender_icon.png 9 December, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

09-12-2025 11:48:43 AM

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. సెషన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ పై దృష్టి పెట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్యూర్, క్యూర్, రేర్ గా విభజించి ప్రణాళికలు చేపట్టామని వెల్లడించారు. ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(Ease of Doing Business)తో ముందుకుపోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్రీ ట్రిలియన్ డాలర్ ఎనానమీ(Three Trillion Dollar Economy) లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అంశంపై చర్చించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని ఆయన సూచించారు. రాష్ట్రం నుంచి మరిన్ని ఆవిష్కరణలు వచ్చేలా కృషి చేస్తామని విక్రమార్క తెలిపారు.