28 July, 2026 | 7:25 AM

జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. రంగంలోకి భట్టి

25-06-2024 02:17 PM

హైదరాబాద్ : జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తనను సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారని ఆయన తీవ్రమనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంగళవారం బేగంపేటలోని  ఆయన నివాసానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, పలువురు కార్యకర్తలు వెళ్లారు.