హైకోర్టులో కేసీఆర్ కు ఊరట
25-06-2024 01:49 PM
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 రైల్ రోకో కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై 18కి వాయిదా వేసింది.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 15,016,17 తేదీల్లో రైల్ రోకో నిర్వహించాలని కేసీఆర్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం పిలుపు ఇచ్చినట్టుగా కొందరి మూఖిక వాంగ్మూలం ఆధారంగా మల్కజ్ గిరి పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు. ఈ కేసుపై స్పందించిన కేసీఆర్ తాను ఎలాంటి పిలుప ఇవ్వలేదని, ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టివేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.






