28 July, 2026 | 6:26 AM

కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

25-06-2024 03:47 PM

న్యూఢిల్లీ : లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై స్టే కొనసాగుతుందని హైకోర్టు వెల్లడించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. ప్రస్తుతం ఆయన తిహాడ్ జైలులో ఉన్నారు. జూన్ 20న కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.