23 May, 2026 | 4:34 PM

గంగమ్మకు భవానీ భక్తుల హారతి..

28-09-2025 06:22 PM

శాంతించమ్మా గంగమ్మా అంటూ వేడుకోలు..

పాపన్నపేట (విజయక్రాంతి): ఎగువ సింగూరు నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు రావడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన దుర్గాభవాని మాల దారులు ఆ గ్రామ శివారులోని మంజీరాకు హారతినిచ్చారు. "శాంతించమ్మా గంగమ్మా" అంటూ వేడుకున్నారు.