calender_icon.png 28 September, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏలే చంద్రశేఖర్

28-09-2025 06:24:30 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో శివాజీ యోజన సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాజరాజేశ్వరి దేవి అలంకరణ అమ్మవారికి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైసొల్ల రామనర్సు, బచ్చు శ్రీనివాస్, ఆమనగంటి శివకుమార్ పాల్గొన్నారు.